బాలీవుడ్‌లో పోలీస్ కథలతో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వచ్చినవే సింగం సీరిస్, సింబా, సూర్యవంశీ ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవన్నీ మంచి వినోదాన్ని పంచాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో ఆయన తొలిసారిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని వారు ప్రకటించారు. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 'ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరి కోసం.. ఈ వార్‌లో మన కుటుంబ సభ్యుల రక్తం చిందినా యుద్ధం ఆగదు' అంటూ కబీర్ పాత్రలో సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు హైలెట్‌గా నిలుస్తున్నాయి.
దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ఈ సిరీస్ హీందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో రీజనల్ లాగ్వేజ్‌ల నుంచి కూడా మేకర్స్‌కు ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ భాషల్లో విడుదల చేయాలంటూ పలువురు నెటిజన్లు ఇప్పటికే పోస్ట్‌లు చేయడం గమనర్హం. హిందీలో అయితే జనవరి 19 నుంచి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను అమెజాన్‌లో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment