కేరళ కాలింగ్‌ | Janhvi Kapoor and Sidharth Malhotra head to Kerala for month long Param Sundari shoot | Sakshi
Sakshi News home page

కేరళ కాలింగ్‌

Published Mon, Jan 20 2025 12:09 AM | Last Updated on Mon, Jan 20 2025 12:09 AM

Janhvi Kapoor and Sidharth Malhotra head to Kerala for month long Param Sundari shoot

కేరళ కాలింగ్‌ అంటున్నారు హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఈ ఇద్దరూ జంటగా హిందీలో ‘పరమ్‌ సుందరి’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తుషార్‌ జలోటా దర్శకత్వంలో దినేష్‌ విజన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా నెల రోజుల లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం సిద్ధార్థ్, జాన్వీ అండ్‌ టీమ్‌ కేరళ వెళ్లారని బాలీవుడ్‌ సమాచారం. ఈ షెడ్యూల్‌లో మేజర్‌ టాకీ పార్ట్, యాక్షన్‌ సీక్వెన్స్, ఓ లవ్‌ సాంగ్‌ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట.

ఇక ఈ సినిమాలో నార్త్‌ అబ్బాయి పరమ్‌ పాత్రలో సిద్ధార్థ్, సౌత్‌ అమ్మాయి సుందరి పాత్రలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కనిపిస్తారు. రెండు విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ అని బాలీవుడ్‌ టాక్‌. ‘పరమ్‌ సుందరి’ సినిమాను ఈ ఏడాది జూలై 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement