Chandigah
-
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
అట్టహాసంగా 90వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు
-
సూసైడ్‌నోట్.. ఆ నలుగురు కలసి నా భార్యను కిడ్నాప్ చేశారు
చంఢీఘర్: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. తన భార్యను నలుగురు దుండగులు .. కిడ్నాప్ చేశారనే మనో వేదనతో సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ప్రకారం.. మక్త్‌సర్ గ్రామ పరిధిలో 39 ఏళ్ల దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఇతను కార్మికుడు. ఈ క్రమంలో తన భార్య కిడ్నాప్‌కు గురైందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని మనస్తాపంతో నిన్న (మంగళవారం) సూసైడ్ నోట్‌రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య కిడ్నాప్ వ్యవహరంలో నలుగురిపై అనుమానం ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు లఖేవాలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిపై స్పందించిన లఖేవాలి పోలీసు అధికారి శిమ్లారాని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కేసు విషయంలో పోలీసుల అలసత్వం కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని మృతుని కూతురు ఆరోపించింది. ఆ తర్వాత, తన తండ్రి ఆత్మహత్యపై.. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్సీఎస్సీ)కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషనర్ అధికారులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై 15 రోజులలో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంజాబ్ డిప్యూటి కమిషనర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను ఆదేశించారు. -
BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు
చండీగఢ్: ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆరు నెలలకు చేరిన సందర్భంగా రైతు సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ నుంచి భారీ స్థాయిలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రాహణ్) సీనియర్ నేత షింగారా సింగ్ సోమవారం చెప్పారు. యువకులు, పెద్దలు అంతా కలసి తమ వాహనాలతో తిక్రి, సింఘు సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్, పాటియాలా, మనసా, బతిందా, మోగ, గుర్దాస్పుర్, ఫరిద్కోట్ జిల్లాల నంచి రైతులు వస్తున్నట్లు షింగారా తెలిపారు. రైతులు చేపట్టనున్న నిరసనకు కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్దు మద్దతు ప్రకటించారు. నిరసన రోజున వారికి సంఘీభావంగా తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తానని చెప్పారు. (చదవండి: CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!) -
గిఫ్ట్‌గా విలాసవంతమైన అపార్ట్మెంట్!
ముంబై: సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటే రెట్టింపు అవుతుందంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. అందుకే తన తోబుట్టువులు, కజిన్స్‌కు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చినట్లు తెలిపారు. వారి కోసం విలాసవంతమైన అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తున్నానని, రెండేళ్లలో కలల సౌధం నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ కంగనా రనౌత్ అనేక కష్టనష్టాలకోర్చి.. బీ-టౌన్లో స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకునే ఆమెను.. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక వంటి చిత్రాలు తనను అగ్రస్థానంలో నిలిపాయి. (చదవండి: ఉక్కు మహిళగా కంగనా) ఇక ఇప్పటికీ అదే క్రేజ్‌తో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కంగన అదే స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె సంపాదన కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కుటుంబం కోసం కంగన సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, చండీగఢ్‌లో అపార్టమెంట్లు నిర్మించి ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తన తోబుట్టువులు రంగోలి, అక్షయ్ రనౌత్‌తో పాటు కజిన్స్‌కు కూడా ఇందులో భాగం ఇవ్వనున్నారని బీ-టౌన్ టాక్. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఈ ఫైర్‌బ్రాండ్.. ‘‘తమ సంపదను కుటుంబంతో పంచుకొమ్మని నేను సలహా ఇస్తాను... ఆనందం పంచుకుంటేనే మరింత ఎక్కువవుతుంది. అందమైన, విలావసంతమైన అపార్టుమెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 2023 నాటికి పూర్తవుతాయి. నా కుటుంబం కోసం ఈ మాత్రం చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వ్యాఖ్యలతో నిలిచే కంగన.. తలైవి, తేజస్, ధాకడ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. I want to encourage people to share their wealth with their family.... remember happiness multiplies when it’s shared, they are beautiful luxury apartments under construction will be ready in 2023 but I am very fortunate that I could do this for my family ❤️ — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 -
60 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా ప్లాస్మా థెరపీ
చండీగఢ్: కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తోన్న ప్లాస్మా థెరపీతో ఓ అరవై ఏళ్ల వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంఘటన చండీగఢ్ పీజీఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కురుక్షేత్రకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యి.. ఆక్సిజన్ థెరపీ అవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్సలు అందించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే అతడికి ఆక్సిజన్ థెరపీని నిలిపివేయడమే కాక క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా మనందరికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే వార్త. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వైద్యులందరికి అభినందనలు. పీజీఐఎమ్ఈఆర్లో ప్లాస్మా థెరపీతో కోలుకున్న మొదటి వ్యక్తి ఇతను. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి ప్లాస్మా థెరపీని అందించాలని సూచిస్తారు. ఈ ప్రయత్నం విజయవంతం అయ్యింది. దీని గురించి మరింత ప్రచారం చేయాల్సి’ ఉంది అన్నారు. (పరమౌషధం కానున్న ప్లాస్మా!) అనస్థీషియా అండ్ ఇంటెన్సివ్ కేర్ విభాగం డీన్ (అకాడెమిక్స్), హెడ్ ప్రొఫెసర్ జీడీ పూరి చికిత్స గురించి తెలుపుతు ‘ప్లాస్మా థెరపీతో కోలుకోవడం సానుకూల సూచిక. ఈ చికిత్స క్లినికల్ ట్రయల్స్ కోసం ఎక్కువ మంది దాతలు ముందుకు రావల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి కోలుకున్న రోగులను రక్త దానం చేసేలా ప్రోత్సాహించమని వారి కుటుంబ సభ్యులు, బంధువులను కోరుతున్నాం’ అన్నారు. ఆక్సిజన్ థెరపీ అవసరమయ్యే కరోనా పాజిటివ్ రోగులకు ప్లాస్మా చికిత్స అందించవచ్చని ఐసీఎమ్ఆర్ తెలిపింది. ట్రయల్స్ కోసం అది ఎంచుకున్న కేంద్రాల్లో పీజీఐ చంఢీగర్‌ను ఒకటి. ఈ క్రమంలో ‘ఏప్రిల్ చివరి వారంలో ఐసీఎమ్ఆర్ పీజీఐని ఎంచుకుంది. మే 9న మొదటి వ్యక్తి ప్లాస్మాను దానం చేశారు. జూన్ 1 న ప్లాస్మా థెరపీ పొందటానికి అర్హత సాధించిన మొదటి కరోనా రోగిని గుర్తించాం. చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు’ అని పూరి తెలిపారు. (కరోనా చికిత్సపై కొత్త ఆశలు) ప్లాస్మా థెరపీ అంటే.. కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ఈ ప్లాస్మా థెరపీలో.. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా తీసుకుంటారు. దీన్ని ‘కన్వలేసెంట్ ప్లాస్మా’ అంటారు. కరోనా వైరస్ సోకిన మొదటి దశలో ఈ ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్లాస్మాలో ఉండే ప్రతిరోధకాల ద్వారా ఈ చికిత్స పనిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగులు మాత్రమే ప్లాస్మాను దానం చేయడానికి అర్హులు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మాను బ్లడ్ బ్యాంకులో నిల్వ వుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్తో వచ్చే రోగుల చికిత్స కోసం వినియోగిస్తారు. -
‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’
చండీగఢ్ : జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదరకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.... రాష్ట్రంలోని గుజ్రాన్ గ్రామానికి చెందిన సిక్కు యువకుడు(25), దళిత యువతి(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతడు ఇంటర్ పాసై పొలం పనులు చూసుకుంటుండగా..యువతి ప్రస్తుతం బీఏ ఫైనలియర్ చదువుతోంది. చాలా ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం పెద్దలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరూ కలిసి యువకుడికి చెందిన పొలానికి వెళ్లారు. అనంతరం తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. ‘ మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దయచేసి నా కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ విషయమై ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను కోరుతున్నా. నేను నా వాళ్లను చాలా కష్టపెట్టాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరందరూ అంటే నాకెంతో ఇష్టం. భయంతో చచ్చిపోతున్నా అని నా ప్రత్యర్థులు భావించవచ్చు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్నా’ అని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తుపాకీతో యువతి పొట్టలో కాల్చి, తాను రెండుసార్లు మెడపై కాల్చుకుని కుప్పకూలాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్ట్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల వద్ద వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. యువతి కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతుందని..ఈ కారణంగానే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న స్థానికుల వివరాల మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
ఎస్బీఐలో అగ్ని ప్రమాదం
చండీగఢ్ : నగరంలోని సెక్టార్ 17లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రధాన శాఖలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బ్యాంకులో 22 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఉద్యోగులందరిని సురక్షితంగా బయటకు చేర్చినట్లు పేర్కొన్నారు. కానీ దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రస్తుతం వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. -
ప్రేమ ప్రయాణం
చండీఘడ్ వీధుల్లో హ్యాపీగా చక్కర్లు కొడుతున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. కానీ ఒంటరిగా కాదులెండి. కార్గిల్‌వార్ (1999) సమయంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న విక్రమ్ బాత్రా బయోపిక్ ‘షేర్షా’గా బాలీవుడ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చంఢీఘర్‌లో జరుగుతోంది. సిద్ధార్థ్, కియారాలపై బైక్ రైడ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లను కూడా ప్లాన్ చేశారు. ఇంకో పదిరోజుల పాటు ఈ సినిమా షెడ్యూల్ చండీఘడ్లోనే జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
రేప్ బాధితురాలిపై కోర్టు షాకింగ్ కామెంట్లు
సాక్షి, ఛండీగఢ్: హర్యానాలో సంచలనం సృష్టించిన లా విద్యార్థిని అత్యాచార ఉదంతం గుర్తుండే ఉంటుంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఛాటింగ్‌ను సాక్ష్యంగా పరిగణిస్తూ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అయితే ఆ శిక్షలను కొట్టేస్తూ ఛండీగఢ్ హైకోర్టు ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెంచ్ బాధితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం విశేషం. బాధితురాలి మానసిక పరివర్తనే జరిగిన అఘాయిత్యానికి కారణమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘కాస్త కూడా పరిణితి లేకుండా అమ్మాయి వ్యవహరించింది. యువకులతో మరీ సానిహిత్యంగా మెలిగింది. పైగా లైంగిక పరమైన కోరికలతోనే స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసింది. దర్యాప్తులో అమ్మాయి అన్ని విషయాలను ఒప్పుకుంది. వైద్యులు కూడా యువతి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదన్న విషయాన్ని తేల్చారు. అలాంటప్పుడు బలవంతంగా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు సరికాదు. అదే సమయంలో నిందితులకు కూడా అంత కఠిన శిక్ష విధించాల్సిన అవసరం లేదు’ బెంచ్ అభిప్రాయపడింది. విద్యార్థుల భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకునే తాము ఈ తీర్పు వెలువరిస్తున్నామని జడ్జిలు మహేష్ గ్రోవర్, రాజ శేఖర్ అట్టిరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోనేపట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్ అనే విద్యార్థులు తమ జూనియర్ అమ్మాయిపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారు. సెక్స్ టాయ్స్ కొనిచ్చి వాటిని వాడుతూ, స్కైప్ లో లైవ్ వీడియో చూపించాలని బెదిరించేవారు. వీరి మధ్య సాగిన అన్ని అంశాలూ వాట్స్ యాప్ లో భద్రంగా ఉండిపోయాయి. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో ఈ యేడాది జూన్‌లో తీర్పు వెలువడింది. నిందితులు, బాధితురాలికి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణనే కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తూ, ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థికి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.