ప్రతీకాత్మక చిత్రం
చంఢీఘర్: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. తన భార్యను నలుగురు దుండగులు .. కిడ్నాప్ చేశారనే మనో వేదనతో సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ప్రకారం.. మక్త్‌సర్ గ్రామ పరిధిలో 39 ఏళ్ల దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఇతను కార్మికుడు. ఈ క్రమంలో తన భార్య కిడ్నాప్‌కు గురైందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని మనస్తాపంతో నిన్న (మంగళవారం) సూసైడ్ నోట్‌రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య కిడ్నాప్ వ్యవహరంలో నలుగురిపై అనుమానం ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు లఖేవాలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిపై స్పందించిన లఖేవాలి పోలీసు అధికారి శిమ్లారాని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కేసు విషయంలో పోలీసుల అలసత్వం కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని మృతుని కూతురు ఆరోపించింది. ఆ తర్వాత, తన తండ్రి ఆత్మహత్యపై.. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ)కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషనర్ అధికారులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై 15 రోజులలో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంజాబ్ డిప్యూటి కమిషనర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment