నువ్వెక్కడుంటే నేనక్కడ! | Are Alia Bhatt, Varun Dhawan and Sidharth Malhotra ignoring each other? | Sakshi
Sakshi News home page

నువ్వెక్కడుంటే నేనక్కడ!

Published Tue, Apr 21 2015 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నువ్వెక్కడుంటే నేనక్కడ! - Sakshi

నువ్వెక్కడుంటే నేనక్కడ!

బాలీవుడ్‌లో హాట్ పెయిర్ అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా. ఎక్కడ చూసినా ఇద్దరూ జంటగా కనిపిస్తున్నా... అది జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమేనంటూ దాటవేస్తున్నారు. లేట్‌నైట్ పార్టీలు, బర్త్‌డే బ్యాష్‌లు... ఇలా ఒకటేమిటి... నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అంటూ ఒకర్ని వదిలి ఒకరు ఉండలేనంతగా కెమిస్ట్రీ నడుస్తోంది వీరిద్దరి మధ్య! రీసెంట్‌గా ఓ టీవీ చానల్ నిర్వహించిన పార్టీలో ఈ తారలిద్దరూ దర్శనమిచ్చారట. అయితే ఒకర్ని ఒకరు కలవకుండానే వెళ్లిపోయారట!

ముందుగా దర్శకుడు కరణ్ జోహార్‌తో అలియా వచ్చింది. మరో పావుగంటలో సిద్ధార్థ్ వస్తాడనేది అప్పటికున్న సమాచారం. అయితే గంటలు గడిచినా జతగాడు రాకపోయే సరికి చికాగ్గా వెళ్లిపోయిందట ముద్దుగుమ్మ. సరిగ్గా అమ్మడు ఎగ్జిట్ అయిన పదిహేను నిమిషాల తరువాత సిద్ధార్థ్ ఎంట్రీ ఇచ్చాడట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement