అతనితో బ్రేకప్? | alia bhatt break up with Siddharth Malhotra | Sakshi
Sakshi News home page

అతనితో బ్రేకప్?

Published Fri, Apr 22 2016 10:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అతనితో బ్రేకప్? - Sakshi

అతనితో బ్రేకప్?

గాసిప్
 

బాలీవుడ్‌లో ప్రేమజంటలకు ఏమైంది? ఇప్పుడు గాసిప్ రాయుళ్లకు క్రేజీ టాపిక్.  రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కేస్తామంటూ ఊరించిన రణ్‌బీర్-కత్రినాకైఫ్‌లు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోతే, ఆ తర్వాత అనుష్కా శర్మ-విరాట్ కొహ్లీలు కూడా వారి బాటనే అనుసరించారు. ఇప్పుడీ లిస్ట్‌లో ఆలియా భట్-సిద్ధార్థ మల్హోత్రాలు చేరనున్నారనే వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్  ద ఇయర్’ చిత్రంతో ఒకేసారి తెరంగేట్రం చేసిన ఆలియా భట్, సిద్ధార్థ మల్హోత్రాల మధ్య  ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇప్పటికే హిందీ పరిశ్రమ వర్గాలు కోడైకూస్తున్నాయి.

అయితే, తాజా ఖబర్ ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా మాటల్లేవట. ఎందుకంటే, ఇటీవల జరిగిన ఓ పార్టీలో ఆలియా మాజీ ప్రేమికుడు ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడం సిద్ధార్థకు నచ్చలేదనీ, ఆ కారణంతో అతనితో గొడవ కూడా పెట్టుకున్నాడట. ఆ కోపంతోనే  సిద్ధార్థతో ఆలియా మునుపటిలా మాట్లాడటం లేదనీ, ఇటీవల సిద్ధార్థ ఇచ్చిన పార్టీకి కూడా ఆమె హాజరుకాలేదని భోగట్టా. మరి ఫ్యూచర్‌లో ఏమవుతుందో ఏంటో మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement