Samantha Shocking Words About 2021 Year In Interview, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha On 2021: నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది

Nov 27 2021 2:22 PM | Updated on Nov 27 2021 2:58 PM

Samantha Said 2021 is Critical Years To Me In a Interview - Sakshi

When Asks Samantha About 2021 Years She Replied.. విడాకుల అనంతరం టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. వరుస సినిమా ఆఫర్లు ఆమెకు క్యూ కడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో జాతీయ స్థాయికి ఎదిగిన సామ్‌.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ రేంజ్‌కు ఎదిగింది. అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ సినిమాతో ఆమె హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్‌ స్వయంగా ప్రకటించింది. అంతేగాక ఇందులో తను బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తుండంతో ఇది తనకు చాలెంజింగ్‌ రోల్‌ అని చెప్పుకొచ్చింది.

చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్‌ ఎంట్రీ..

అలాగే సమంత తాప్సీ పన్ను నిర్మాణంలో ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆ ప్రాజెక్ట్‌ టీం తాప్సీ పన్ను, సిద్దార్థ్‌ మల్హోత్రా, కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌తో ఓ ఈవెంట్‌లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే స‌మంత తాజాగా బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్రతో పాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొంది.

చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా?

డిసెంబర్‌ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ స్పెషల్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారలను కోరగా.. సమంత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’ అని చెప్పుకొచ్చింది. కాగా సమంత తమిళలో​ కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది. దీనితో పాటు డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాణంలో సమంత మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement