
సిద్ధార్థ్ మల్హోత్రా
కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్లే తారలు కొందరైతే ఏ ప్లానింగ్ లేకుండా ముందుకు సాగిపోయే తారలు కొందరు ఉంటారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మొదటి రకం. ‘రాబోయే ఐదేళ్లలో మీ కెరీర్ ప్లాన్స్ ఏంటీ? అన్న ప్రశ్నను ఈ కుర్ర హీరో ముందు ఉంచితే... ‘‘రాబోయే రోజుల్లో నేను ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకుంటున్నాను. హాలీవుడ్ మార్వెల్ సిరీస్ చిత్రాలకు నేను అభిమానిని.
నా ప్రొడక్షన్ హౌస్‌లో ఓ సూపర్‌హీరో మూవీ చేసే ఆలోచన ఉంది. అందులో నేనూ నటిస్తాను. మన పురాణగాథల ఆధారంగా చాలా గొప్ప చిత్రాలు తీయొచ్చు. ఈ విషయంపై కూడా సినిమాలు చేసే ప్లాన్స్ ఉన్నాయి’’ అని అన్నారు. ఇంకా చెబుతూ– ‘‘నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నాను. అందుకే ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్.
Comments
Please login to add a commentAdd a comment