ఆ సినిమాను మిస్‌ కాకండి: ఆమిర్‌ఖాన్‌ | Aamir Khan Says Dont Miss HICHKI Movie  | Sakshi
Sakshi News home page

దయచేసి మిస్‌ కాకండి: ఆమిర్‌ఖాన్‌

Published Fri, Mar 23 2018 9:03 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

Aamir Khan - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ (ఫైల్‌)

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌కు ఏదైనా నచ్చితే వెంటనే స్పందిస్తాడు. తాజాగా రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్‌కి’ చిత్రంపై ట్వీట్‌ చేశాడు. సినిమాను మిస్‌ కాకండి ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి అని పోస్ట్‌ చేశాడు. 

సిద్దార్థ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిగా, యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను వీక్షించిన ఆమిర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ..‘చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశాను. గొప్ప కథ, అద్భుత నటన, సూపర్‌ సినిమా, ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఉంది. అదే హిచ్‌కి సినిమా. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. రాణీ, సిద్దార్థ్‌, నీరజ్‌ కబి, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement