'అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో ఆమిర్ సభ్యుడై ఉంటే' | 'Nobody is understanding Aamir khan's pain' Tweets Puri Jagannath | Sakshi
Sakshi News home page

'అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో ఆమిర్ సభ్యుడై ఉంటే'

Published Fri, Nov 27 2015 3:13 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో ఆమిర్ సభ్యుడై ఉంటే' - Sakshi

'అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో ఆమిర్ సభ్యుడై ఉంటే'

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ 'అసహనం'పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతునే ఊంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు పలువురు ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించారు. చివరకు ఆమిర్ వివరణ కూడా ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే తాజాగా ఇదే విషయమై టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ స్పందించారు.

'పనికిమాలినవాళ్లంతా ఆమిర్ ఖాన్ మీద మండిపడుతున్నారు.. దానికి కారణం అతను ఓ సెలబ్రిటీ కావడమే. అదే ఆమిర్ అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో సభ్యుడై ఉంటే ఏ ఒక్క భారతీయుడికైనా ఇలాంటి నాన్సెన్స్ క్రియేట్ చేయడానికి ధైర్యం ఉంటుందా?' అంటూ ట్విట్టర్లో స్పందించారు. ఆమిర్ ఖాన్ బాధను ఎవరూ అర్థం చేసుకోవడంలేదని.. ప్రతి ఒక్కరు వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పూరీ. చూడాలి.. ఇక పూరీ కామెంట్స్ మీద ఎన్ని సెటైర్లు పడతాయో!

 

— PURI JAGAN (@purijagan) November 27, 2015

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement