
సాక్షి, ముంబై: టాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నరష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన ఈ చార్మింగ్ బ్యూటీ తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్ రోల్ పోషించనుంది. ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు బాలీవుడ్ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్ చేశారు. (మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!)
ఈ మూవీ వచ్చే యేడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అమర్ బుటాలా, గరిమా మెహతా నిర్మాతలు. చిత్రానికి పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్‌లు కథను అందిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ సినిమాపై స్పందిస్తూ..‘‘మిషన్ మజ్ను’మనదేశానికి చెందిన పౌరులను రక్షించడానికి వెళ్లిన గూఢచార్ల నిజమైన సాహసవీరులనుంచి ప్రేరణ పొందిన దేశభక్తి కథ అని వివరించారు. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఓ మిషన్ విజయవంతం చేసే రా ఏజెంట్‌గా నటిస్తున్నానని తెలిపారు. బాలీవుడ్ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ అన్నీ భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నాననీ ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తుండంటం చాలా సంతోషమంటూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. (రజనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్)
కాగా ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక ఇటీవల కాలంలో వరుసగా హిట్లతో వరుస అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment