Mission Majnu First Look: Rashmika Mandanna, Sidharth Malhotra Shares First Look Of Mission Majnu - Sakshi
Sakshi News home page

‘మిషన్ మజ్ను’ షూటింగ్‌ ప్రారంభం

Published Thu, Feb 11 2021 5:56 PM | Last Updated on Fri, Feb 12 2021 9:48 AM

Sidharth Malhotra,Rashmika Share First Look From Mission Majnu - Sakshi

అతి తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకున్న రష్మిక మందన్నా..వరుస సినిమాలతో దూసుకుపోతుంది.  టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక త్వరలోనే బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనుంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్నోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో హీరో, హీరోయిన్ల ఫస్ట్‌లుక్‌ ఫోటోని  చిత్రబృందం విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఓ మిషన్‌ విజయవంతం చేసే రా ఏజెంట్‌గా సిద్ధార్థ్‌ కనిపించనుండగా, రష్మిక లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. (దుమ్మురేపుతున్న రష్మిక ‘టాప్ టక్కర్’ టీజర్‌)

1970 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శాంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాల, గరిమ మెహత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తైన తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలోనూ రష్మిక కనిపించనుంది. వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో వస్తున్న  ‘డాడీ’ సినిమాలో అమితాబ్‌ కుమార్తె పాత్రలో  రష్మిక కనిపించనుంది.  వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. పాన్‌ఇండియా స్థాయిలో  ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ రష్మిక నటించనుంది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement