తన అభిమానులను మూడు మొక్కలు నాటుమంటున్న హీరో | Siddharth Malhotra Accept Green India Challenge | Sakshi
Sakshi News home page

Siddharth Malhotra: మొక్కలు నాటిన బాలీవుడ్‌ హీరో.. అభిమానులకు సవాల్‌

Published Sat, Nov 27 2021 1:25 PM | Last Updated on Sat, Nov 27 2021 1:26 PM

Siddharth Malhotra Accept Green India Challenge - Sakshi

Siddharth Malhotra Accept Green India Challenge: తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌  ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సామాన్యులతో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎందరో మొక‍్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్ర కూడా పర్యావరణాన్ని కాపాడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు సిద్ధార్థ్‌. మూడు మొక‍్కలు నాటి, తన అభిమానులందరికి 'గ్రీన్‌ ఇండియా సవాల్‌' విసిరాడు. తన అభిమానులందరూ అతడిలా మూడు మొక్కలు నాటుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరాడు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
 

ఈ విషయాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తన ట్విటర్‌లో తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సిద్ధార్థ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన 10 మిలియన్‌ ఫాలోవర్స్‌ అందరూ ఈ ఛాలెంజ్‌ను కొనసాగించాలని కోరారు. సిద్ధార్థ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'యోధ' మంచి సక్సెస్ సాధించాలని 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పారు. 

'రాధేశ్యామ్‌' హీరోయిన్‌ పూజా హెగ్డే  ఈ ఛాలెంజ్‌ను శుక్రవారం స్వీకరించి మొక్కలు నాటింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను యువ హీరో సుశాంత్‌ నుంచి స్వీకరించి, బాలీవుడ్‌ హీరో అ‍క్షయ్‌ కుమార్‌కు సవాల్‌ విసిరింది. ఇంతకుముందు అమీర్‌ ఖాన్, నాగ చైతన్య కలిసి ఈ కార్యక‍్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వతహాగా సవాల్‌ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్‌ ప్రశాంత్‌కు ఛాలెంజ్‌ విసిరారు. 
ఇదీ చదవండి: 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' స్వీకరించిన రాధేశ్యామ్‌ బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement