సిద్ధార్థ్ ప్రేమపాఠాలు | Sidharth Malhotra wants to impress Deepika Padukone, romance Kareena Kapoor | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్ ప్రేమపాఠాలు

Published Tue, Feb 4 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

సిద్ధార్థ్ ప్రేమపాఠాలు

సిద్ధార్థ్ ప్రేమపాఠాలు

కొత్త నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కరీనా కపూర్‌ఖాన్, దీపికా పదుకొణే అంటే చాలా ఇష్టమట. తెరపై వాళ్లతో నటించడానికి ముందే ఇద్దరినీ ఆకర్షిస్తానని చెబుతున్నాడు. ‘దీపిక చాలా ఆసక్తికర యువతి. చాలా అందంగా ఉంటుంది కూడా. మోడల్‌గా పనిచేసినప్పటి నుంచే ఆమెతో పరిచయం. అయితే ఆమెతో మాట్లాడి చాలా కాలమయింది. దీపికను కలుసుకొని ఆకర్షించేందుకు ప్రయత్నించడం చాలా సరదాగా ఉంటుంది. ఇందుకు ముందే కాస్త సాధన చేయాలేమో! కరీనాకు కూడా నేను వీరాభిమానిని. తెరపైనా, బయటా ఎంతో సరదాగా ఉంటుంది.
 
 ఆమె ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమెతో రొమాన్స్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది’ అని సిద్ధార్థ్ వివరించాడు. కరణ్ జోహార్ తీసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తెరపైకి వచ్చిన ఈ యువహీరో తాజా సినిమా హసీ తో ఫసీ. పరిణీతి చోప్రా ఇందులో హీరోయిన్. ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ ఏ రంగంలోని అమ్మాయిని అయినా ఆకర్షించాలంటే (ఇంప్రెస్) చాలా కష్టపడాల్సి ఉంటుందని, ఆమె నవ్వితేనే ‘పడిపోయినట్టు’ కాదంటూ చమత్కరించాడు. ఆడవాళ్ల ఇష్టాయిష్టాల గురించి పూర్తిగా తెలిసుంటేనే ఆకర్షించడం సాధ్యపడుతుందంటూ యువతకు సలహా ఇచ్చాడు.
 
 ‘ఈ విషయంలో కొందరు చాలా హుషారుగా ఉంటారు. కొందరేమో ముద్దుపప్పులా ప్రవర్తిస్తారు. ఒక్కో యువతి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి వాళ్లను ఆకర్షించడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏదీ ఉండదు’ అంటూ ప్రేమపాఠాలు చెప్పాడు. హసీ తో ఫసీ తరువాత సిద్ధార్థ్‌కు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ముంబై మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుందని కాబట్టి సరదాగా ఉంటుందని, గ్లామర్ పాళ్లు తక్కువగాఉంటాయని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పాడు. హసీ తో ఫసీ ఈ శుక్రవారం విడుదలవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement