Rashmika Mandanna Hindi Movie Mission Majnu Direct Release In OTT, Deets Inside - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna-OTT: డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న రష్మిక లేటెస్ట్‌ మూవీ?

Published Thu, Nov 17 2022 4:12 PM | Last Updated on Thu, Nov 17 2022 6:24 PM

Rashmika Mandanna Hindi Movie Mission Majnu Opts for OTT Premiere - Sakshi

గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక మంద‌న్నా. గ‌త నెల‌లో థియేట‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. ఆమె హిందీలో నటించిన మరో చిత్రం మిషన్‌ మజ్ను. ఈ మూవీతో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో రష్మీక జతకట్టింది. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్ద హీరోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదల కానున్నడంతో మూవీ టీం విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది.

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్‌ బాబు కీలక నిర్ణయం!

అయితే అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. అంతేకాదు ప్రమోషన్స్‌ అని కూడా చిత్ర బృందం హడావుడి కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చిది. ఈ తాజా బజ్‌ ప్రకారం మిషన్‌ మజ్ను చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేసే ఆలోచన మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిట‌ల్ ప్రీమియ‌ర్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్న‌ట్లు సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా బాలీవుడ్‌లో ర‌ష్మిక అంగీక‌రించిన తొలి సినిమా ఇది. కానీ ఆమె రెండవ చిత్రం గుడ్‌బై మొదట విడుదలై ప్లాప్‌టాక్‌ తెచ్చుకుంది. కాగా స్పె యాక్షన్‌ థ్రిల్లర్‌గా శాంత‌ను బాగ్చీ మిషన్‌ మజ్ను చిత్రాన్ని రూపొందించాడు. భార‌త సైన్యం త‌ల‌పెట్టిన గొప్ప కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement