ఇంతలో అంత ప్రమాదం! | Meanwhile the risk! | Sakshi
Sakshi News home page

ఇంతలో అంత ప్రమాదం!

Apr 11 2014 2:36 AM | Updated on Sep 2 2017 5:51 AM

ఇంతలో అంత ప్రమాదం!

ఇంతలో అంత ప్రమాదం!

గులాబీ రేకంత సున్నితంగా కనిపిస్తారు శ్రద్ధాకపూర్. ఈ సుకుమారికి ఇటీవల ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఏక్ విలన్’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

గులాబీ రేకంత సున్నితంగా కనిపిస్తారు శ్రద్ధాకపూర్. ఈ సుకుమారికి ఇటీవల ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఏక్ విలన్’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రద్ధా ద్విచక్ర వాహనం నడిపే ఓ సన్నివేశం ఉంది. సినిమాకి ఆ సీన్ కీలకం కాబట్టి, బైక్ నడపడం నేర్చుకుని, షూటింగ్‌కి సిద్ధపడ్డారామె. సన్నివేశంలో భాగంగా చిత్రకథానాయకుడు సిద్ధార్ధ్ మల్హోత్రా వాహనాన్ని శ్రద్ధా వెంబడించాలి.
 
సిద్ధార్ధ్ తన బుల్లెట్ మీద కూర్చుని షాట్‌కి రెడీ అయ్యారు. శ్రద్ధా కూడా తన వాహనం మీద కూర్చున్నారు. దర్శకుడు మోహిత్ సూరి ‘స్టార్ట్ కెమెరా...’ అనగానే శ్రద్ధా బైక్ స్టార్ట్ చేశారు. సిద్ధార్ధ్ వాహనాన్ని వెంబడించాలి కాబట్టి, యాక్సిలరేటర్‌ని బలంగా నొక్కారు. ఆ వేగానికి బైక్‌ని నియంత్రించలేకపోయారు శ్రద్ధా. దాంతో వాహనం స్కిడ్ అవ్వడం, శ్రద్ధా కిందపడటం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ బ్యూటీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
 
కానీ, శరీరం మీద అక్కడక్కడా చిన్నపాటి గాయాలయ్యాయి. చిత్రబృందం వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అనుకోని ఈ సంఘటన వల్ల దాదాపు గంట సేపు షూటింగ్ ఆపేశారు. ఆ గంటలోపు శ్రద్ధా తేరుకున్నారు. ‘అమ్మో భయం..’ అనకుండా ఈ చిత్రీకరణలో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement