Ek villain
-
హ్యాపీ హ్యాపీగా..
ఏక్ విలన్, హైదర్ హిట్స్‌తో మంచి ఊపుమీదున్న నటి శ్రద్ధాకపూర్ ఈ కొత్త సంవత్సరం మస్తుగా ఎంజాయ్ చేస్తానంటోంది. ఈ సారి న్యూ ఇయర్‌ని లాస్ వెగాస్‌లో చేసుకుంటున్నందుకు సంబరపడిపోతోంది. శ్రద్ధ తాజాగా నటిస్తున్న ‘ఏబీసీడీ 2’ సినిమా లాస్ వెగాస్‌లో షూటింగ్ కోసం వెళ్తోంది. న్యూ ఇయర్ వేడుకలు లాస్ వెగాస్‌లో చేసుకునే అవకాశం కొద్ది మందికే వస్తుందంటున్న శ్రద్ధ.. ఆ చాన్స్ తనకు వచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది. సినిమా యూనిట్‌తో కొత్త సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలుకుతానని ఆనందంగా చెబుతోంది. -
హోప్... సక్సెస్!
వరుస హిట్స్‌తో హుషారు మీదున్న అప్‌కమింగ్ స్టార్ శ్రద్ధాకపూర్... దాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఏక్ విలన్, హైదర్’ చిత్రాలు మంచి విజయం సాధించడం... ఈ అమ్మడిలో ఉత్సాహం నింపాయట. 2015 కూడా ఇలాగే దూసుకుపోవాలని కోరుకుంటుందట. ‘వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే గానీ... వాటి కోసం ఆరాటపడను. నాదంతా ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకుపోయే మనస్తత్వం. 2014 హ్యాపీ ఇయర్. రాబోయే సంవత్సరం కూడా ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ లవ్లీ గాళ్ ‘ఏబీసీడీ 2’లో నటిస్తోంది. వరుణ్‌ధావన్ హీరో. వచ్చే ఏడాది మధ్యలో విడుదల అవుతుంది. -
ఇంతలో అంత ప్రమాదం!
గులాబీ రేకంత సున్నితంగా కనిపిస్తారు శ్రద్ధాకపూర్. ఈ సుకుమారికి ఇటీవల ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఏక్ విలన్’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా ద్విచక్ర వాహనం నడిపే ఓ సన్నివేశం ఉంది. సినిమాకి ఆ సీన్ కీలకం కాబట్టి, బైక్ నడపడం నేర్చుకుని, షూటింగ్‌కి సిద్ధపడ్డారామె. సన్నివేశంలో భాగంగా చిత్రకథానాయకుడు సిద్ధార్ధ్ మల్హోత్రా వాహనాన్ని శ్రద్ధా వెంబడించాలి. సిద్ధార్ధ్ తన బుల్లెట్ మీద కూర్చుని షాట్‌కి రెడీ అయ్యారు. శ్రద్ధా కూడా తన వాహనం మీద కూర్చున్నారు. దర్శకుడు మోహిత్ సూరి ‘స్టార్ట్ కెమెరా...’ అనగానే శ్రద్ధా బైక్ స్టార్ట్ చేశారు. సిద్ధార్ధ్ వాహనాన్ని వెంబడించాలి కాబట్టి, యాక్సిలరేటర్‌ని బలంగా నొక్కారు. ఆ వేగానికి బైక్‌ని నియంత్రించలేకపోయారు శ్రద్ధా. దాంతో వాహనం స్కిడ్ అవ్వడం, శ్రద్ధా కిందపడటం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ బ్యూటీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, శరీరం మీద అక్కడక్కడా చిన్నపాటి గాయాలయ్యాయి. చిత్రబృందం వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అనుకోని ఈ సంఘటన వల్ల దాదాపు గంట సేపు షూటింగ్ ఆపేశారు. ఆ గంటలోపు శ్రద్ధా తేరుకున్నారు. ‘అమ్మో భయం..’ అనకుండా ఈ చిత్రీకరణలో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేశారు.