
ఇటీవల సౌత్ లో కాస్త జోరు తగ్గించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ఇటీవల అయ్యారితో మరోసారి ఆకట్టుకుంది. తాజాగా మరో బాలీవుడ్ మూవీకి రకుల్ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాతో రకుల్ హీరోయిన్‌గా నటించనుంది.
ఈ సినిమా కోసం సిద్ధార్థ్ మల్హాత్రాతో రెండో సారి జత కడుతోంది రకుల్. అయ్యారి సినిమాలోనూ వీరిద్దరు జంటగా నటించిన విషయం తెలిసిందే. మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాను టీ సిరీస్‌తో కలిసి నిఖిల్ అద్వాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment