త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌! | Kiara Advani, Sidharth Malhotra Wedding Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Kiara Advani-Siddharth Malhotra: త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌!

Published Fri, Feb 25 2022 7:50 PM | Last Updated on Fri, Feb 25 2022 7:56 PM

Kiara Advani, Sidharth Malhotra Wedding Rumours Goes Viral - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి రిలేషన్‌ను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్య బాలీవుడ్‌ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంగా సిద్ధార్థ్‌-కియారాలు కూడా  ఏడడుగులు వేయాలని అనుకుంటున్నారట.

చదవండి: ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్‌ ప్రేమయాణం..

అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై నోరు విప్పని ఈజంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్‌ వేడ్డింగ్‌కు ప్లాన్‌ చేసుకుంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కియారా-సిద్ధార్థ్‌లు కలిసి చేసింది ఒక్క సినిమానే. దీంతో తెరపై వీరి కెమిస్ట్రీ చూసి చూడ చక్కని జంటని అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో 2022 మధ్యలో లేదా, ఏడాది చివరిలో పెళ్లికి ప్లాన్‌ చేసుకుంటున్నారట ఈ లవ్‌బర్డ్స్‌. మరి ఈ వార్తలపై కియారా-సిద్ధార్థ్‌లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన కత్రినా-విక్కీలు చివరి వరకు వారి రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన సంగతి తెలిసిందే. 

చదవండి: పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ను నార్త్‌లో ప్లాన్‌ చేస్తున్న సుక్కు? బాలీవుడ్‌ హీరోకు కీ రోల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement