సిద్దార్థ్‌తో బ్రేకప్‌ రూమర్స్‌, తొలిసారి స్పందించిన కియారా | Kiara Advani Respond On Rumours Over Break Up With Siddharth Malhotra | Sakshi
Sakshi News home page

Kiara Advani: ప్రియుడితో బ్రేకప్‌ రూమర్స్‌పై తొలిసారి ‍స్పందించిన కియారా

Published Wed, Apr 27 2022 8:46 PM | Last Updated on Wed, Apr 27 2022 8:53 PM

Kiara Advani Respond On Rumours Over Break Up With Siddharth Malhotra - Sakshi

Kiara Advani Respond On Break Up With Siddharth Malhotra: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రాల బ్రేకప్‌ బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు. వీరి బ్రేకప్‌పై బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్న తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. కానీ, గొడవల వల్ల కాదని, షూటింగ్‌లో బిజీ ఉండటం వల్ల అంటూ అందరిని ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌.

చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్‌, సుదీప్‌ మధ్య ట్వీట్ల వార్‌

ఇదిలా ఉంటే తాజాగా వీరి బ్రేకప్‌ వార్తలపై స్పందించి కియారా అద్వాని. కియారా తాజాగా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇది విని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య ఏం జరగలేదని, వీరి బ్రేకప్‌ వార్తల్లో నిజం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు.

చదవండి: పునీత్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత

ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారాలు వారి రిలేషన్‌పై ఇంతవరకు స్పందించలేదు. కానీ ముంబై రోడ్లలో జంటగా చక్కర్లు కొడుతూ విందులు, వినోదాలకు కలిసి వెళుతుంటారు. అంతేకాదు కియారా పలుమార్లు సిద్ధార్థ్‌ ఇంటికి వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో విరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి.  2021లో వీరిద్దరు జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలో కియారా, సిద్ధార్థ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. కాగా భూల్ భూలయ్యా 2 చిత్రంలో కియారా, కార్తీక్‌ ఆర్యన్‌కు జోడిగా నటిస్తోంది. ఇందులో సీనియర్‌ నటి టబు కీ రోల్‌ పోషిస్తోంది. 

చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement