Finally Sidharth Malhotra, Kiara Advani Tie The Knot in Rajasthan - Sakshi
Sakshi News home page

Sidharth Malhotra-Kiara Advani: కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌.. పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్‌!

Published Tue, Feb 7 2023 6:30 PM | Last Updated on Tue, Feb 7 2023 6:45 PM

Finally Sidharth Malhotra, Kiara Advani Tie The knot in Rajasthan - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్‌ మీడియాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఇంకా బయటకు రాలేదు. అయితే వీరి పెళ్లి తంతుకు హాజరయ్యేందుకు వెళ్లిన పలువురు బాలీవుడ్‌ సినీ నటీనటులు కియార-సిద్ధార్థ్‌ వెడ్డింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

నటి ప్రీతి జింటా కియారా-సిద్ధార్థ్‌ వెడ్డింగ్‌ వైబ్స్‌ అంటూ సోమవారం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. కాగా కొంతకాలంగా వీరిద్దరు ప్రేమ ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీర్దిదరూ ఎప్పుడూ తమ డేటింగ్‌ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. తామిద్దరం స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్న  ఈజంట పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచింది. వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

చదవండి: 
పెళ్లి చేసుకున్న ‘నేనింతే’ హీరోయిన్‌, వరుడు ఎవరంటే!
సుమంత్‌తో విడాకుల తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement