వెండితెరపై సినిమాలు ఎన్నో వస్తుంటాయ్ పోతుంటాయ్. అందులో పరాజయాలు, హిట్లు, బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉంటాయ్ కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతాయి. అలాంటి చిత్రమే దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’. ఈ చిత్రం తెలుగు సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ చిత్రంలో ఎందరో నటీనటులు భాగస్వామ్యం అయ్యారు. కానీ ఇందులో కొన్ని పాత్రలకే గుర్తింపు దక్కింది.
చదవండి: ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..
అలాగే ‘ఈ నటుడు బాహుబలిలో ఉన్నాడా?’ అనుకునే గుర్తుపట్టలేని పాత్రలు కూడా చాలా ఉన్నాయి. అందులో జాన్ కొక్కెన్ పాత్ర కూడా ఒకటి. మ్యాన్లీ హీరో ఆర్య తాజా చిత్రం ‘సార్పట్ట’తో ఒక్కసారిగా అందరిని దృష్టి ఆకర్షించాడు జాన్ కొక్కెన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేపథ్యంలో బాహుబలిలోని తన పాత్ర గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర విషయం పంచుకున్నాడు. అయితే బాహుబలి సినిమా అంటే ప్రభాస్, రానా, రమ్యకృష్ణల తర్వాత గుర్తొచ్చే మరో పాత్ర కాళకేయ. కాళకేయుడిగా ప్రభాకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
చదవండి: అందువల్లే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ
అయితే ఇదే గ్యాంగ్‌లో జాన్ కొక్కెన్ కూడా ఉన్నాడు. కాళకేయ సైనికుల్లో తను ఓ సైనికుడి పాత్ర పోషించిన జాన్ కొక్కెన్ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బాహుబలిలో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయానికి నా పేరు ఎవరికీ తెలియదు. అయితే ఏదో ఒక రోజు నా పేరు అందరికి తెలుస్తుందని చెప్పాను. ఆ సమయం ఇప్పటికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఫొటోను గర్వంగా షేర్ చేస్తున్నాను. ఏదో ఒకరోజు నన్ను అందరూ గుర్తించే స్థాయికి ఎదుగుతానని అజిత్ సార్ చెప్పారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు.
చదవండి: పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్
కాగా దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన ‘సార్పట్టా’ చిత్రంలో వెంబులి(వేటపులి) పాత్రలో జాన్ కొక్కెన్ నటించాడు. ఈ పాత్రకు గాను అతడికి మంచి గుర్తింపు వచ్చింది. శివ దర్శకత్వంలో అజిత్ నటించిన వీరం చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్ కొక్కెన్.. ఆ తర్వాత తెలుగులో ‘ఎవడు, వన్ నేనొక్కడినే, వీరుడొక్కడుతో పాటు కేజీఎఫ్ చాప్టర్ వన్ తదితర సినిమాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment