
'రివ్యూలు చదవొద్దు.. ఎవరి మాటలు వినొద్దు'
హైదరాబాబాద్: 'బాహుబలి' సినిమా అత్యద్భుతంగా ఉందని హీరో అల్లు శిరీష్ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు తనను తాను మైమరచిపోయానని ట్విటర్ లో పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ రాలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి ఇలాంటి గొప్ప సినిమా వచ్చినందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
'బాహుబలి' సినిమా గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదన్నారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో చెప్పాల్సి వస్తే తనకు 10 నుంచి 15 ట్వీట్లు అవసరమవుతాయన్నారు. ఎటువంటి రివ్యూలు చదవొద్దు, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. నేరుగా ధియేటర్ కు వెళ్లి సినిమా చూడండి' అని ప్రేక్షకులకు సూచించారు.