Rakesh Varre Peka Medalu Movie First Look Viral - Sakshi
Sakshi News home page

Bahubali Rakesh New Movie: మరో డిఫరెంట్ మూవీతో వస్తున్న రాకేష్

Published Wed, Jul 19 2023 5:52 PM | Last Updated on Wed, Jul 19 2023 6:27 PM

Rakesh Varre Peka Medalu Movie First Look - Sakshi

'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల’ అని బాహుబలి ప్రభాస్.. ఓ వ్యక్తి తలను నరికేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు నిర్మా‍తగా మరో సినిమాని ప్రకటించాడు. కొత్త హీరోహీరోయిన్లని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు.

(ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!)

యువనటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'.  2019 దసరాకి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ.. ఓటీటీల్లోనూ బాగానే ఆదరణ దక‍్కించుకుంది. ఇప్పుడు అదే బ్యానర్‌పై రాకేష్ నిర్మాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'పేకమేడలు' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీతో వినోద్ కిషన్, అనూష కృష్ణ టాలీవుడ్‌కి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. 

నీలగిరి మామిళ్ళ.. నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ బస్తీ, సిటీని 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన హీరో లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపించాడు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంజ్‌ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement