
'రాజమౌళి మరో హిట్ కొట్టాడు'
హైదరాబాద్: 'బాహుబలి' సినిమాతో తన సోదరుడు రాజమౌళి మరో హిట్ కొట్టారని నటుడు, రచయిత ఎస్ ఎస్ కాంచి అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే సినిమా తీశారని కితాబిచ్చారు. ఇండియన్ సినిమా విలువను ప్రపంచానికి చాటి చెప్పారని మెచ్చుకున్నారు.
'బాహుబలి' చిత్రానికి పనిచేసిన వారందరికీ ట్విటర్ లో అభినందనలు తెలిపారు. వారికి అందించడానికి మరిన్ని మెమొంటోలు అవసరమవుతాయని పేర్కొన్నారు. తన అన్నయ్య, అమ్మ(శ్రీవల్లి) పడిన కష్టం సఫలమయినందుకు సంతోషంగా ఉందన్నారు. మూడేళ్లు కష్టపడి విజయవంతంగా గొప్ప సినిమాను నిర్మించిన శోభు, చిన్నాలకు ఆయన అభినందనలు తెలిపారు.