
'దర్శక బాహుబలికి సెల్యూట్'
హైదరాబాద్: నెక్ట్స్ సెన్సేషన్ కోసం 2016 వరకు ఆగక తప్పదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యనించింది. 'బాహుబలి' సినిమా రెండో భాగం కోసం ఆమె ఈ కామెంట్ చేసింది. తాజాగా విడుదలైన 'బాహుబలి' సినిమా శనివారం చూశానని, సూపర్బ్ గా ఉందని తన ఫేస్ బుక్ పేజీలో సుమ పోస్ట్ చేసింది. ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన 'దర్శక బాహుబలి'కి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొంది.
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడులైన 'బాహుబలి' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ రాజమౌళి గొప్పగా తీశాడని సోషల్ మీడియాలో ప్రశంసించారు.