
'బాహుబలి' చూసిన 'బాద్ షా' భార్య
ముంబై: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాకు తెలుగులోఏ కాదు తమిళం, హిందీ భాషాల్లోనూ క్రీజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. 'టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ' గా మారిన బాహుబలి సినిమా చూసేందుకు సెలబిట్రీలు అమితాసక్తి చూపించారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ విడుదల రోజే ఈ సినిమా చూశారు. గౌరీ ఖాన్ తన కారులో సినిమాకు వెళుతున్న ఫోటోలు ట్విటర్ లో పోస్ట్ చేశారు.
సినిమా చూసిన పలువురు ప్రముఖులు 'బాహుబలి' యూనిట్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్, తమన్నా, కీరవాణి, నిర్మాలకు తమిళ దర్శకుడు లింగుస్వామి మనస్ఫూర్తిగా అభినందలు తెలిపారు. మంచు మనోజ్, మంచు విష్ణు, అల్లరి నరేశ్, తరుణ్ తేజ్, రాధిక, రిచా గంగోపాధ్యాయ, స్నేహ ఉల్లాల్, సోనాల్ చౌహాన్, రకుల్ ప్రీత్ తదితరులు 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.