జితేందర్ ‍రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్! | Rakesh Varre Latest Movie Jithendar Reddy Poster Released Today, Goes Viral - Sakshi
Sakshi News home page

Rakesh Varre: జితేందర్ ‍రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!

Published Mon, Oct 2 2023 3:24 PM | Last Updated on Mon, Oct 2 2023 5:01 PM

Rakesh Varre Latest Movie Jitender Reddy Poster Released Today - Sakshi

బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకేశ్ వర్రే. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా  పోస్టర్లు  రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్‌ పేరులో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ మేకర్స్ తెరదించారు. హీరో పేరును రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. 

జితేందర్ రెడ్డి పాత్రలో రాకేశ్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్‌గా కనిపించారు.ఈ పోస్టర్‌లో అతను యంగ్ పోలీస్‌లా కనిపించాడు. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న రాకేశ్ చాలా గ్యాప్ తర్వాత  జితేందర్ రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే అసలు జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని విషయాలు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ నటుడు ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు సమయం పట్టిందట. చాలా మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రేను ఎంచుకున్నారు. ఈ మూవీని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement