‘పేకమేడలు’ మూవీ రివ్యూ | 'Pekamedalu' Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Pekamedalu Movie Review : ‘పేకమేడలు’ ఎలా ఉందంటే..?

Published Fri, Jul 19 2024 10:37 AM | Last Updated on Sun, Jul 21 2024 2:16 PM

'Pekamedalu' Movie Review And Rating In Telugu

టైటిల్‌: పేక మేడలు
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ 
నిర్మాణ సంస్థలు: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేశ్‌ వర్రే
దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
సంగీతం: స్మరణ్‌ సాయి
సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.
విడుదల తేది: జులై 19, 2024

కథేంటి?
లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు మూసీ నదికి ఒడ్డున బస్తీలో నివసిస్తుంటారు. అబ్బాయికి మెరుగైన జీవితం కోసం మంచి కాలనీకి మారాలని వరలక్ష్మి ఆశ పడుతుంది. ఆమె సంపాదన మీద పడి బతకడం తప్ప ఉద్యోగం సద్యోగం చెయ్యడు లక్ష్మణ్. ఇంజనీరింగ్‌ చదివినా..జాబ్‌ చేయకుండా. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడతాడు. రియల్‌ ఎస్టేట్‌ కోసం భర్త, పిల్లల్ని అమెరికాలో వదిలేసి వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్)ను ట్రాప్ చేస్తాడు. శ్వేత దృష్టిలో తాను రిచ్‌ అని చూపించుకునేందుకు భార్య పేరు వాడుకుని అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మి ఏం చేసింది? లక్ష్మణ్ ఏం చేశాడు? అతడిని కొట్టినది ఎవరు? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

ఎలా ఉందంటే?
భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే..భార్య కష్టపడి ఫ్యామిలీని పోషించడం అనే పాయింట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.  పేక మేడలు కథ కూడా అదే. అయితే ఇందులో క్లైమాక్స్‌ మాత్రం కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్‌ కూడా బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఇది ఫిక్షనల్‌ స్టోరీ అయినా.. మూవీ చూస్తుంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారన్నట్టు ఉంది. బస్తీలో లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందనేది ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభ అయినా 30 నిమిషాల వరకు నెమ్మదిగా సాగుతుంది. ఎన్నారై లేడీ ఎంటరైన తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్వెల్‌ వరకు కథ చాలా సరద సరదగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో మాత్రం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. మహిళా సాధికారికతను గొప్పగా చూపించారు. ప్రీ క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే గొడవ సీన్‌ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ సినిమాటిక్‌గా కాకుండా.. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

ఎవరెలా చేశారు?
వినోద్ కిషన్ ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అయితే, అతడు ఆల్రెడీ తమిళంలో ఫిల్మ్స్ చేశాడు. లక్ష్మణ్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ యాప్ట్. అతడి లీన్ పర్సనాలిటీ కూడా సూట్ అయ్యింది. మిడిల్ క్లాస్ వైఫ్ అంటే అనూష క్రిష్ణ అనుకోవాలి. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్, ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు సైతం చక్కగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... మ్యూజిక్ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా.. చాలా రిచ్‌గా నిర్మించారు. 
- రేటింగ్‌: 2.5/5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement