
‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న...’ అంటూ మొదలవుతుంది ‘పేకమేడలు’ సినిమాలోని ‘బూమ్ బూమ్ లచ్చన్న’ పాట. ‘నా పేరు శివ, అంధగారం’ సినిమాల ఫేమ్ వినోద్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ఇది. ఇందులో అనూషా కృష్ణ హీరోయిన్. రాకేష్ వర్రే నిర్మించిన ఈ చిత్రం జూలైలో విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్ లచ్చన్న...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రసంగీత దర్శకుడు స్మరణ్ సాయి నేతృత్వంలో భార్గవ్ కార్తీక్ సాహిత్యం అందించిన ఈ పాటను మనో పాడారు. రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment