మూవీ లవర్స్‌కి క్రేజీ ఆఫర్.. రూ.50కే కొత్త సినిమా ప్రీమియర్ | Peka Medalu Movie Paid Premieres For 50 Rupees | Sakshi
Sakshi News home page

Peka Medalu: క్రేజీ ఆఫర్.. రూ.50కే కొత్త సినిమా ప్రీమియర్

Published Tue, Jul 16 2024 1:59 PM | Last Updated on Tue, Jul 16 2024 5:39 PM

Peka Medalu Movie Paid Premieres For 50 Rupees

ఇప్పట్లో కొత్త సినిమా చూడాలంటే రెండు మూడొందలైనా పెట్టాల్సిందే. అలాంటిది కొత్త సినిమా, అది కూడా రూ.50కే అంటే మంచి ఆఫర్ కదా! మీరు విన్నది నిజమే. 'నా పేరు శివ' సినిమాలో విలన్ తరహా పాత్ర చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ కిషన్. ఇతడు హీరోగా నటించిన తెలుగు సినిమా 'పేక మేడలు'. జూలై 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే టికెట్‌పై భారీ ఆఫర్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)

రాకేష్ వర్రే నిర్మించిన రెండో సినిమా 'పేక మేడలు'. మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ కథతో ఈ మూవీ తీశారు. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల రిలీజ్‌కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. వీటిలోనే ఒక్కో టికెట్ రూ.50గా నిర్ణయించారు. ఈ విషయాన్ని హీరోతోనే చెప్పిస్తూ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ కాలంలో అసలు థియేటర్లకే జనాలు రావడం లేదు. అలాంటిది రూ.50 టికెట్ అంటే సినిమా ఎలా ఉందని కాకపోయినా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయడానికైనా సరే ప్రేక్షకులు వచ్చే అవకాశముంది. 'పేకమేడలు'పై పెద్దగా అంచనాల్లేవు. దీనితో పాటు వస్తున్న ప్రియదర్శి 'డార్లింగ్'పై కాస్త అంచనాలు ఉన్నాయి.

(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement