కాజల్ కొత్త సినిమా రిలీజ్.. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్స్! | Kajal Satyabhama Movie Free Tickets For Ladies | Sakshi

బంపరాఫర్.. లేడీస్ కోసం 'సత్యభామ' స్పెషల్ ప్రీమియర్

Jun 5 2024 1:49 PM | Updated on Jun 5 2024 2:47 PM

Kajal Satyabhama Movie Free Tickets For Ladies

కొత్త సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కాజల్ అగర్వాల్.. 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ శుక్రవారం అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేశారు. తాజాగా మహిళల కోసం బంపరాఫర్ ప్రకటించారు. ఉచితంగా టికెట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?)

కాజల్ అగర్వాల్ 'సత్యభామ' మూవీ.. జూన్ 7న థియేటర్లలోకి రానుంది. కానీ అంతకంటే ముందే హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న అంటే బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షో టికెట్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని 'గూఢచారి', 'క్షణం' సినిమాల ఫేమ్ శశి కిరణ్ తిక్క నిర్మించారు. సుమన్ చిక్కల దర్శకత్వం వహించాడు.

(ఇదీ చదవండి: 'కల్కి' ట్రైలర్‌ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement