కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ వంటి యాక్షన్ సినిమాతో నా కెరీర్‌లో ఓ కొత్త దశలోకి వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను.
కొత్త ఎమోషన్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశాను. శశిగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. కథపై నమ్మకం కలిగింది. అయితే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ నమ్మకం రెట్టింపు అయ్యింది. శశిగారు లేకపోతే ‘సత్యభామ’ లేదు. కీరవాణి, చంద్రబోస్‌గార్లకు థ్యాంక్స్. ‘వెతుకు వెతుకు..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అమర్ పాత్రలో నవీన్ చంద్ర బాగా యాక్ట్ చేశారు. టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. నన్ను స్టార్ హీరోయిన్‌ని చేసిన తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘సత్యభామ’ సినిమాపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘సినిమాల పట్ల కాజల్‌గారికి ఉన్న ప్యాషన్ మమ్మల్ని ఇన్‌సై్పర్ చేసింది. ‘సత్యభామ’ను థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయండి’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. నా మొదటి హీరో (సినిమాలో కాజల్ లీడ్ రోల్ చేశారు కాబట్టి హీరో అని సంబోధించారు) కాజల్‌గారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘కాజల్‌గారు కథ విన్న వెంటనే షూటింగ్ ఎప్పట్నుంచి ప్లాన్ చేసుకుంటారనడంతో మేం సర్‌ప్రైజ్ అయ్యాం. ఎమోషనల్ పవర్‌ప్యాక్డ్ ఫిల్మ్ ‘సత్యభామ’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘సత్యభామ’ చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. మా చేతిలో ఓ సక్సెస్‌ఫుల్ సినిమా ఉంది’’ అన్నారు నవీన్‌చంద్ర. పాటల రచయిత రాంబాబు, ఎడిటర్ పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment