అయూబ్‌దే పైచేయి | Crucial HCA elections today | Sakshi
Sakshi News home page

అయూబ్‌దే పైచేయి

Published Mon, Sep 8 2014 12:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అయూబ్‌దే పైచేయి - Sakshi

అయూబ్‌దే పైచేయి

హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో వినోద్‌పై విజయం
 కార్యదర్శిగా జాన్ మనోజ్ ఎన్నిక
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ ప్యానెల్ జయభేరి మోగించింది. ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో అయూబ్ వర్గం... జి. వినోద్ టీమ్‌ను చిత్తు చేసింది. అయూబ్ 58 ఓట్ల తేడాతో వినోద్‌ను ఓడించి రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  
 
 అయూబ్‌కు 133 ఓట్లు రాగా, వినోద్‌కు 75 ఓట్లు మాత్రమే పడ్డాయి. కార్యదర్శిగా అయూబ్ వర్గానికే చెందిన జాన్ మనోజ్ ఎన్నికయ్యారు. జాన్ మనోజ్ (119) 30 ఓట్ల తేడాతో ఎస్. వెంకటేశ్వరన్ (89)పై గెలుపొందారు. మొత్తం ఆఫీస్ బేరర్ పదవులన్నింటినీ అయూబ్ వర్గమే గెలుచుకోవడం విశేషం. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్ కూడా పరాజయం పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement