సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తొలిసారి ప్రత్యక్షంగా హైదరాబాద్ క్రికెట్‌కు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ నెల 10నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంప్ ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లో కొనసాగుతుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఇందు కోసం హెచ్‌సీఏ మొత్తం 32 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరిలో చాలా మంది ఇప్పటికే రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించగా... మరికొందరు అండర్-23, అండర్-19 జట్ల ఆటగాళ్లు ఉన్నారు.
వీవీఎస్ ‘స్పెషల్’ కోచింగ్
Published Fri, Jul 3 2015 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement