![Vinod Adani: Adani group says Vinod Adani is part of promoter group - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/17/vinod-adani%2C-gautam-adani.jpg.webp?itok=d8aVTT5R)
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్‌లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే.
వినోద్‌కు అదానీ గ్రూప్‌లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment