Promoters Group
-
వినోద్ అదానీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమే: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్‌లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే. వినోద్‌కు అదానీ గ్రూప్‌లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది. -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్‌పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి. -
షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జీ గ్రూపు ప్రమోటర్లు ఆరు లిస్టెడ్ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్ మార్కెట్లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, డిష్‌టీవీ, జీ మీడియా కార్పొరేషన్, సిటీ నెట్వర్క్స్, జీ లెర్న్ కంపెనీల్లో వాటాలను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎస్సెల్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రంగంలో చేసిన వ్యాపారాలు బెడిసి కొట్టాయని, భారీ రుణ భారాన్ని తీర్చడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు జీ ప్రమోటర్ సుభాష్‌చంద్ర గత నెల 26న ప్రకటించడం గమనార్హం. అమ్మకాలు వీటిల్లోనే... ►జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల సంస్థలు అయిన... సైక్వేటర్ మీడియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ 1.69 శాతం, ఎస్సెల్ కార్పొరేట్ ఎల్ఎల్పీ 0.85 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ఈవాటాల విక్రయం ద్వారానే ప్రమోటర్లకు రూ.874.11 కోట్లు సమకూరాయి. ►డిష్ టీవీలో వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ 0.86 శాతం, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్ 0.80 శాతం, వీనా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ 0.35 శాతం చొప్పున రూ.97.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ►జీ మీడియా కార్పొరేషన్లో ఏఆర్ఎం ఇన్ఫ్రా అండ్ యుటిలిటీస్ 2.38 శాతం, 25ఎఫ్‌పీఎస్ మీడియా 3.09 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ►సిటీ నెట్‌వర్క్స్‌లో ఆరో మీడియా అండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రైవేటు లిమిటెడ్ 4.50 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ.28.88 కోట్లుగా ఉంది. -
10 శాతం తగ్గిన పిపవావ్
గత కొన్ని రోజులుగా జోరుగా పెరుగుతున్న పిపవావ్ డిఫెన్స్ షేర్ 10 శాతం క్షీణించి రూ.68.85 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌ను రూ.63 చొప్పున నిఖిల్ గాంధీ నేతృత్వంలోని ప్రమోటర్ల గ్రూప్ నుంచి 18 శాతం వాటాను రూ.819 కోట్లకు కొనుగోలు చేయనున్నామని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ క్షీణత కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కో రోజులోనే రూ.563 కోట్లు హరించుకుపోయి రూ.5,069 కోట్లకు తగ్గింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ పిపవావ్ డిఫెన్స్‌లో రూ.2,082 కోట్లతో నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ షేర్ 3 శాతం వృద్ధితో రూ.490 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.391 కోట్లు పెరిగి రూ.12,880 కోట్లకు చేరింది.