
కారును చూస్తున్న వినోద్‌కుమార్, రవీందర్‌రావు
సాక్షి, సిరిసిల్ల: పట్టణ శివారులోని సర్ధాపూర్‌లో ఓ కారును చూసి కరీంనగర్ పార్లమెం ట్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్ మురిసిపోయారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్‌రావు తన సొంత పాతకారు గులాబీ రంగు వేసి రోడ్డు పక్కన గద్దె నిర్మించి ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కారుగుర్తు ఓటర్ల మదిలో ఉండిపోయేలా శ్రీనివాస్‌రావు ఏకంగా కారును అందరికీ కనిపించేలా ఏర్పాటుచేశారు. ఎంపీ వినోద్‌కుమార్ ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తూ రోడ్డుపక్కనే ఉన్న కారును చూసి ఆగి సందర్శించారు. ఎన్నికల్లో అందరికీ కారుగుర్తు గుర్తుండిపోయేలా సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే కారును ఏర్పాటుచేయడాన్ని వినోద్‌కుమార్ అభినందించారు. ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment