
పట్టుబడ్డ శ్యామ్సన్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : గత సెప్టెంబరు నెల 28న నెలమంగల పట్టణంలో సినీహీరో వినోద్‌రాజ్ కారులో నగదు అపహరించిన కేసులో ప్రధాన నిందితుడిని నెలమంగల పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు చిత్తూరు జిల్లా నగరి తాలూకా ఓజీ కుప్పం నివాసి శ్యామ్సన్‌గా గుర్తించారు. సెప్టెంబర్ 28న బ్యాంకు నుండి డ్రా చేసుకున్న నగదును తన కారులో పెట్టిన వినోద్‌రాజ్ నెలమంగల పట్టణంలోని ఒక వస్త్ర దుకాణం ముందు పంక్చర్ అయిన కారు టైర్ మారుస్తుండగా అక్కడకు వచ్చిన నలుగురు అపరిచిత వ్యక్తులు అభిమానులుగా పరిచయం చేసుకుని మాటల్లో దింపి కారులోని నగదు మాయం చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 7న పట్టణంలోని ఒక బ్యాంక్ ముందు శ్యామ్సన్ చోరీ చేయడానికి కాపుకాచి ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వినోద్‌రాజ్ కారులో నగదు చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న మరో ముగ్గురు చిన్న, తులసి, నరేశ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment