
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్‌లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment