
కరీంనగర్: మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలస కూలీ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం బైపాస్ రోడ్డు పనులు చేపడుతున్న డీబీఎల్ కంపెనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంగికలన్ మీర్జాపూర్‌కు చెందిన వినోద్(23) కూలీగా పనిచేస్తున్నాడు. ఓం ప్రకాశ్ అనే మరోవ్యక్తితో ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం ఖాజీపేటకు వెళ్లారు. తిరిగి తుమ్మనపల్లికి గురువారం అర్ధరాత్రి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓంప్రకాశ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుడు ఆమల్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి చదవండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు..
Comments
Please login to add a commentAdd a comment