ఆ యువకుడు ఏమయ్యాడో ? | About the state of the young man? | Sakshi
Sakshi News home page

ఆ యువకుడు ఏమయ్యాడో ?

Published Thu, Oct 29 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

ఆ యువకుడు ఏమయ్యాడో ?

ఆ యువకుడు ఏమయ్యాడో ?

రేణిగుంటలో ఓ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని వినోద్(24) రోడ్డు ప్రమాదానికి గురై ఆ తర్వాత అదృశ్యమయ్యాడు.

రేణిగుంట : రేణిగుంటలో ఓ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని వినోద్(24) రోడ్డు ప్రమాదానికి గురై ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఏర్పేడులో నివాసముంటున్న అతను రేణిగుంటలో మంగళవారం రాత్రి దుకాణం మూసి ఏర్పేడుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని గురవరాజపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

అయితే అతను ఏమయ్యాడో అంతుచిక్కలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement