మా ఓటు ఎక్కడంటే..! | somebody having vote at one place and those contest another place | Sakshi
Sakshi News home page

మా ఓటు ఎక్కడంటే..!

Published Mon, Apr 28 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

somebody having vote at one place and those contest another place

మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : రిజర్వుడు స్థానాలకు వలస వచ్చిన నేతలు.. సొంత నియోజకవర్గం వదిలి సురక్షిత స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు.. పునర్విభజనతో పాత స్థానాలు చెల్లాచెదురైన నాయకులకు సొంత ఓటు దూరమవుతోంది. వారి ఓటు ఒక చోట ఉండటం, పోటీ మరొక చోట చేయడంతో ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలోని రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో కొందరు అభ్యర్థులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బాల్క సుమన్ కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో ఓటు హక్కు ఉంది. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి తులసీదాస్ తన నియోజకవర్గంలో కాకుండా ఆదిలాబాద్‌లో ఓటు ఉంది. అదేవిధంగా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్‌లో ఓటు వేయనున్నారు.

 పార్లమెంట్ స్థానాలు..
 ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఉట్నూర్‌లో, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెడం నగేష్ బజర్‌హత్నూర్ మండలం జాతర్లలో, కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ గుడిహత్నూర్ మండలం తోషంలో ఓటు వేయనున్నారు.
 పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద, టీడీపీ అభ్యర్థి శరత్‌బాబు మంచిర్యాలలో, టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో ఓటు వేయనున్నారు.
 శాసనసభ స్థానాలు..
 ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజ్జంకి అనిల్‌కుమార్, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, కాంగ్రెస్ అభ్యర్థి బార్గవ్ దేశ్‌పాండే ఆదిలాబాద్‌లో, టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న జైనథ్ మండలం దీపాయిగూడలో ఓటు వేయనున్నారు.

 నిర్మల్ : నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి అల్లూరి మల్లారెడ్డి నిర్మల్ మండలం మాధాపూర్‌లో, టీడీపీ అభ్యర్థి మిర్జాయాసిన్ బేగం, కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఐకే రెడ్డి నిర్మల్‌లో.. టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు మామడ మండలం దిమ్మతుర్తిలో ఓటు వేయనున్నారు.

 ఖానాపూర్ : ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ ఖానాపూర్‌లో, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ జన్నారంలో, టీడీపీ అభ్యర్థి రితీష్ రాథోడ్ ఉట్నూర్‌లో ఓటు వేయనున్నారు.

 బోథ్ : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సా ర్ సీపీ అభ్యర్థి గెడం తులసీదాస్ తాను పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా ఆదిలాబాద్‌లో ఓటు వేయనున్నా రు. అదేవిధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురా వు ఇచ్చోడలో, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్ నేరడిగొండ మండలం రాజూరలో, టీడీపీ సోయం బాపురా వు బోథ్ మండలం నాగోగులలో ఓటువేయనున్నారు.

 ముథోల్ : ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి భైంసా మండలం దేగాంలో, టీఆర్‌ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి భైంసాలో, బీజేపీ అభ్యర్థి రమాదేవి కుంటాల మండలం అందపూర్‌లో ఓటు వేయనున్నారు.

 మంచిర్యాల : మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి సయ్యద్ అఫ్జలుద్దీన్, టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డి, బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డిలు మంచిర్యాలలో ఓటు వేయనున్నారు.

 చెన్నూర్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ మేకల ప్రమీల , బీజేపీ అభ్యర్థి రాం వే ణు, టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు మందమర్రిలో, గడ్డం వినోద్ పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా హైదరాబాద్‌లో ఓటు వేయనున్నారు.

 బెల్లంపల్లి : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజ్‌కిరణ్, సీపీఐ అభ్యర్థి గుం డా మల్లేష్, టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రలు బెల్లంపల్లి లో, టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నెన్నల మండ లం జెండా వెంకటాపూర్‌లో ఓటు వేయనున్నారు.

 ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కు తిర్యాణి మండలం లక్ష్మీపూర్‌లో, టీఆర్‌ఎస్ అభ్యర్థి కొవ లక్ష్మీ, టీడీపీ అభ్యర్థి మర్సుకోల సరస్వతీలు ఆసిఫాబాద్‌లో ఓటు వేయనున్నారు.

 సిర్పర్ కాగజ్‌నగర్ :
సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వైఎస్సార్ సీపీ షబ్బీర్ హుస్సేన్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి సమ్మయ్య, టీడీపీ అభ్యర్థి రావి శ్రీనివాస్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పలు కాగ జ్‌నగర్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement