కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది సొంత బావను హత్య చేశాడు.
కరీంనగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది సొంత బావను హత్య చేశాడు. తన మాటకు ఎదురు చెప్పాడనే కోపంతో బావమరిది ఇత్తడి బకెట్‌తో దాడి చేయడంతో.. బావ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎల్లంబజార్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతారం గ్రామానికి చెందిన పిల్లి రమేష్ (33) మామ గారింట్లో జరుగుతున్న ఘర్షణను నివారించేందుకు ఎల్లంబజార్‌కు వచ్చాడు.
ఈ క్రమంలో బావమరిది తీరు నచ్చలేదని చెప్పడంతో.. కోపోద్రిక్తుడైన బావమరిది వినోద్... ఇత్తడి బకెట్‌తో బావపై దాడి చేశాడు. దీంతో రమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.