శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన సోదరుడు వినోద్‌లు సోమవారం టీఆర్‌ఎస్ విడిచి సొంత గూటికి చేరారు. డిల్లీలో దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పార్టీకి ఎదురుదెబ్బ త గలడమే కాకుండా ఆయనతోపాటు గతంలో కాంగ్రెస్ విడిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేతలకు ఇప్పడు ఎన్నికల వేళ ఎటూ వెళ్లాలనే సందిగ్ధం నెలకొంది.
వివేక్ వర్గీయులు చాలా మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొందరు ఆయనను నమ్మి పోటీలో ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికల వేళ ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వివేక్ వెంట వెళ్లాలనుకున్న ఇప్పడికిప్పుడు సాధ్యం కాదు. కారణం టీఆర్‌ఎస్ బీ-ఫామ్‌లతో పోటీలో ఉండి పార్టీ మారితే గెలుపు గల్లంతే. ఎన్నికల వేళ వివేక్ తమను విడిచిపోవడం బాధగా ఉందని ఆయన వర్గీయ నేత ఒకరు న్యూస్‌లైన్‌కు వాపోయారు.
గడ్డు పరిస్థితులే..
వివే క్ పార్టీ మారడంతో రాచకొండ కుటుంబం గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తున్నది. మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబం కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్ల పని చేసింది. వివేక్ తండ్రి వెంకటస్వామి నుంచి వివేక్ వరకు వారిని అంటిపెట్టుకొని రాజకీయంగా ఎదుగు తూ వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌లో ది వాకర్‌రావు, ఎంపీ వివేక్, ప్రేంసాగర్‌రావు మూ డు గ్రూపులు ఉన్నప్పుడు వారు వివేక్ బలంలో రాణించారు. కొద్దికాలం క్రితం వివేక్ కాంగ్రెస్ ను విడిచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్‌లోకి వివేక్ చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణారావు భార్య మంజుల మం చిర్యాల 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ లో ఉంది. ఆమె గెలిచి, టీఆర్‌ఎస్ ఎక్కువ స్థా నాలను కైవసం చేసుకొంటే మున్సిపల్ చైర్మన్ పదవి ఆమెకే ఇస్తానని ముందే వివేక్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ప్యానల్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కృష్ణారావు తమ్ముడు వెంకటేశ్వర్‌రావు కూడా ఆయన భార్య ఆశలతను మంచిర్యాల జెడ్పీటీసీగా బరి లో ఉంది. ఈ టిక్కెట్ పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న మండల అధ్యక్షుడు వంగ తిరుప తి, యువజన విభాగం తూర్పు జిల్లా అధ్యక్షు డు బేర సత్యనారాయణను కాదని ఎంపీ వివేక్ ఒత్తిడితో ఆశలతకే టిక్కెట్ ఇచ్చారు.
ఆశలత గెలిస్తే ఆమెకు జెడ్పీ చైర్మన్ ఇప్పించడానికి సన్నాహాలు చేశారు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు వివేక్ ఒత్తిడితో ఇవ్వడం జరిగింది. నేడు ఆ అభ్యర్థులతో పాటు పార్టీ నాయకత్వం కూడా ఆందోళన చెందుతుంది. వివేక్ మనుషులుగా ముద్ర పడ్డ అభ్యర్థులు ఇప్పడు వివేక్ వెంట పోయే పరిస్థితి లేకుండా చట్రంలో ఇరుక్కున్నారు. పోటీలో లేని కొందరు నాయకులు ఆయన వెంట నడిస్తే ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురీత తప్పదని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైన వివేక్ పార్టీ మారడంతో టీఆర్ ఎస్ పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైర్మన్ పదవులు దక్కేనా..
ఇదిలా ఉంటే ఎంపీ ఆశీస్సులతో మున్సిపల్, జెడ్‌పీ చైర్మన్ పదవులు అలంకరించవచ్చనుకు న్న వారికి ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారింది. వివేక్ వర్గీయులుగా ఉన్న వీరు గెలిచిన తరువాత చైర్మన్ పదవులకు దివాకర్‌రావు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు షాక్
Published Tue, Apr 1 2014 12:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement