
కవితకు పోచారం, వినోద్ పరామర్శ
నిజామాబాద్ ఎంపీ కవిత నగరంలోని యశోదా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత నగరంలోని యశోదా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. జలుబు, దగ్గుకు తోడు బుధవారం జ్వరం కూడా రావడంతో రక్తనమూనాలను పరీక్షల కోసం పంపారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆమెను పరామర్శించారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు.