
గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇస్తే..
సాక్షి, హైదరాబాద్ : ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్ వినోద్ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.