ముసుగుల రహస్యం ఏంటి? | romantic criminals movie press meet | Sakshi

ముసుగుల రహస్యం ఏంటి?

Apr 22 2019 2:14 AM | Updated on Apr 22 2019 8:09 AM

romantic criminals movie press meet - Sakshi

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ’ లాంటి సందేశాత్మక కమర్షియల్‌ హిట్‌ చిత్రాలు తీసిన  పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’. మనోజ్‌ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్‌ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బి.బాపిరాజు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్స్‌లో గతంలో విడుదలైన ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’ తెరకెక్కించాం.

ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ’ చిత్రాలను మించిన వినోదంతో పాటు సమాజానికి మంచి మెసేజ్‌ ఈ చిత్రంలో ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేసి, మేలో సినిమాని రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు’’ అన్నారు సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్‌ మారోయో, కెమెరా: ఎస్‌.వి. శివరామ్, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రావు, డాక్టర్‌ కె.శ్రీనివాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement