Manoj Nandan
-
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్‌పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
ముసుగుల వెనుక రహస్యం
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా నటించారు. ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. బి.బాపిరాజు మాట్లాడుతూ–‘‘ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ చిత్రాల్ని మించిన వినోదంతో పాటు చక్కటి మెసేజ్ ఉంటుంది’’ అన్నారు పి.సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారియో, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
ముసుగుల రహస్యం ఏంటి?
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బి.బాపిరాజు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్స్‌లో గతంలో విడుదలైన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘రొమాంటిక్ క్రిమినల్స్’ తెరకెక్కించాం. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలను మించిన వినోదంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేసి, మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారోయో, కెమెరా: ఎస్.వి. శివరామ్, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
డి ఫర్ డెవిల్!
దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు డీయస్పీ గుర్తొస్తారు. కానీ, ఇప్పుడాయన పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అలాగని, ఇదేదో మ్యూజికల్ బేస్డ్ సిన్మా కాదు. డి ఫర్ డెవిల్, ఎస్ ఫర్ సస్పెన్స్‌లతో తెరకెక్కిన పి ఫర్ పక్కా హారర్ థ్రిల్లర్. పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, భూపాల్ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన థ్రిల్లర్ ‘దేవిశ్రీ ప్రసాద్’. ధనరాజ్ కీలక పాత్రధారి. అక్టోబర్‌లో సిన్మాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘వినోదంతో పాటు సందేశంతో రూపొందిన చిత్రమిది. దేవి, శ్రీ, ప్రసాద్... అనే ముగ్గురు నటులు, లీలా రామచంద్రన్ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. సిన్మాలో ప్రతి సీన్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
చూసిన రోజునే...
మనోజ్‌నందన్, స్మితికాచార్య జంటగా బాల.జి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘ఏ రోజైతే చూశానో’. ఆర్.యస్.క్రియేషన్ప్, శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకాలపై తన్నీరు సింహాద్రి, సిందిరి గిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త ఏడాది మొదటి వారమే మా చిత్రం విడుదలవుతుండడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘నేటి తరం యువతకు మా చిత్రం నచ్చేలా తీశాం. ప్రేమ, వినోదం.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. స్మితికా చార్య కొత్త అమ్మాయి అయినా అనుభవం ఉన్నవారిలా నటించారు. చూసిన రోజునే ప్రేమలో పడే ఓ జంట కథ ఇది. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు.