సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్‌ఎస్ పార్టీలను పిటిషన్‌లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్‌రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment